సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి ఎస్‌ఎన్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ అమూల్య పట్నాయక్ శనివారం పదవీవిరమణ చేయనున్నారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణలను అదుపు చేయడంలో అమూల్య విఫలమయ్యారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఆర్‌పీఎఫ్ నుంచి స్పెషల్ కమిషనర్ (శాంతిభద్రతలు)గా హోంమంత్రిత్వ శాఖ శ్రీవాస్తవను తీసుకొచ్చిన కొద్దిరోజులకే ఆయనకు ఢిల్లీ పోలీస్ చీఫ్ బాధ్యతలను కట్టబెట్టారు. మరోవైపు ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 38కి చేరింది.
ఢిల్లీ పోలీస్ చీఫ్‌గా ఎస్‌ఎన్ శ్రీవాస్తవ