రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారిన కొల్లాపూర్ ‘పుర’పోరు కథ సుఖాంతమైంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయులు 9 మంది గెలుపొందగా.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున బరిలో దిగిన జూపల్లి వర్గీయులు 11 మంది విజయం సాధించారు. దీంతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పుర పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తమ ఎక్స్‌అఫీషియో ఓట్లతో ఆ పుర పీఠంపై గులాబీ జెండా ఎగరేసేందుకు స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కొల్లాపూర్‌కు చేరుకున్నారు. ముందుగా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు అనూహ్యంగా సమావేశ గది బయటికి వెళ్లిపోయారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎక్స్‌అఫీషియో ఓట్లతో టీఆర్‌ఎస్ కొల్లాపూర్ పురంపై గులాబీ జెండా ఎగిరింది.
కొల్లాపూర్‌లో ‘గులాబీ’ని గెలిపించారు..